ఎదుట ఎవ్వరు లేరు ఇంతా విష్ణుమయమే
వదలక హరి దాస వర్గమైన వారికి
చ: ముంచిన నారాయణ మూర్తులీ జెగమెల్ల
అంచిత నామములే ఈ అక్షరాలెల్ల
పంచుకున్న శ్రీహరి ప్రసాదమీ రుచులెల్ల
తెంచివేసిమేలు తా తెలిసేటివారికి (ఎ)
చ: చేరి పారేటి నదులు శ్రీపాద తీర్థమే
భారపు ఈ భూమీ తన పాద రేణువే
సారపు కర్మంబులు కేశవు కైంకర్యంబులే
ధీరులై వివేకించి తెలిసేటి వారికి (ఎ)
చ: చిత్తములో భావములెల్ల శ్రీవేంకటేశుడే
అద్దిన ప్రకృతియెల్ల ఆతని మాయే
మద్దిలి ఈతని కంటే మరిలేదు ఇతరములు
తిత్తి దేహపు బ్రతుకు తెలిసేటి వారికి (ఎ)
edutaa evvaru leeru intaa vishnu mayamee
vadalaka hari dasa vargamaina variki
1. munchina narayana murthulee jagamella
anchita namamule ee aksharaalella
panchukunna srihari prasadamee ruchulella
tenchivesinelu thaa teliseetivariki
2. cheri pareeti nadulu sripaada thirthame
bharapu ee bhumee thana paada reenuvee
saarapu karmambulu kesavu kainkaryambulee
dhirulai viveekinchi theliseeti variki
3. chittamuloo bhavamulella Srivenkateesudee
addina prakruthi yella aathani mayee
matthhili eethani kantee marileedu itharamulu
thittideehapu brathuku theliseeti variki
Tuesday, March 31, 2009
Subscribe to:
Comments (Atom)